KTR: టూరిజం పాలసీపై హాట్ కామెంట్స్ ..! 6 d ago
అసెంబ్లీలో టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రెండు అంశాలపై తప్పక చర్చించాలన్నారు. అందులో ఒకటి ఢిల్లీ టూరిజం, మరొకటి జైల్ టూరిజం అని అన్నారు. ఢిల్లీ టూరిజంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వందసార్లకుపైగా దేశ రాజధానికి వెళ్లివచ్చారని, వారి పర్యటనతో రాష్ట్రానికి రూపాయి ప్రయోజనం కూడా కలగలేదని విమర్శించారు. ఇక జైలు టూరిజంలో భాగంగా 40 మంది కొడంగల్ రైతులను జైలుపాలు చేశారన్నారు. సెలబ్రెటీ నటులను జైలుకు పంపించారని, బెయిల్ వచ్చినా విడుదల చేయలేదని మండిపడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.